Hyderabad Police goes electric for emergency response

HYDERABAD: Hyderabad City Police inducted 15 Tata Punch EV Smart+ electric vehicles on Thursday to strengthen emergency response services for women, children and senior citizens, as well as routine law and order patrolling.
Of the 15 vehicles, seven have been allocated to the Spandana teams, which respond to emergencies involving women and children, while eight will be used for law and order duties.
Telangana Director General of Police (DGP) C.V. Anand flagged off the vehicles at the City Armed Reserve (CAR) headquarters in Petlaburj.
హైదరాబాద్ సిటీ పోలీసుల అమ్ములపొదిలోకి ఈవీ స్మార్ట్ వాహనాలు
స్పందనకు 7, శాంతిభద్రతల విధులకు 8 కార్ల కేటాయింపు
15 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
మహిళలు, పిల్లల రక్షణే ధ్యేయంగా ‘స్పందన’ విస్తరణ
హైదరాబాద్ సిటీ పోలీస్‌లోకి సరికొత్తగా ఈవీ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు చేరాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధుల తక్షణ రక్షణ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న స్పందన బృందాలకు 7, శాంతిభద్రతల పెట్రోలింగ్ విధుల కోసం 8 కలిపి మొత్తం 15 టాటా పంచ్ ఈవీ స్మార్ట్+ వాహనాలను కేటాయించారు.
పెట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు జెండా ఊపి వీటిని లాంఛనంగా ప్రారంభించారు.
అత్యాధునిక 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. నగరంలోని అత్యంత ఇరుకైన వీధులు, గల్లీల్లోకి సైతం శరవేగంగా దూసుకెళ్లగలగడం వీటి ప్రత్యేకత. తద్వారా ఆపదలో ఉన్న బాధితులకు స్పందన సిబ్బంది ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ అత్యవసర సాయాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) వీటిని సమకూర్చింది.
ఈ సందర్భంగా డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. సాధారణంగా ఠాణాల్లోని పెట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్య శాంతిభద్రతల విధులు, ఇతర పిటిషన్ల విచారణలోనే నిమగ్నమై ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తక్షణమే రంగంలోకి దిగే ప్రత్యేక స్పందన బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా ప్రత్యేక వాహనాలు సమకూరడంతో స్పందన మరింత బలోపేతమైందని, ఆపదలో ఉన్నవారి నుంచి కాల్స్ రాగానే క్షణాల్లో ఘటనా స్థలానికి వాహనాలను పంపించేలా ‘డయల్ 112’ కంట్రోల్ రూమ్ వ్యవస్థతో పక్కాగా సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సత్వర చర్యలు చేపట్టేందుకు వీలుగా సీఎస్సార్ కింద ఈ వాహనాలను సమకూర్చిన దాతలకు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ)కి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం హైదరాబాద్ సీపీ శ్రీ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి తక్షణ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్పందన’ వాహనాలకు ప్రజల నుంచి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే మహిళా పోలీస్ డ్రైవర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే.. ఇరుకైన ప్రాంతాల్లోనూ మరింత వేగంగా బాధితులను చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకున్నట్లు వివరించారు.
కాగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ‘స్పందన’ మహిళా నేతృత్వ అత్యవసర స్పందన వ్యవస్థ క్షేత్రస్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. నగరంలోని 7 లా అండ్ ఆర్డర్ జోన్లలో 14 బృందాలు విధులు నిర్వహిస్తుండగా, ప్రతి వాహనంలో మహిళా డ్రైవర్‌తో పాటు ఒక సివిల్ ఉమెన్ కానిస్టేబుల్, ఒక ఆర్మ్డ్ రిజర్వ్ ఉమెన్ కానిస్టేబుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్షేత్ర బృందాలు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 వరకు రెండు షిఫ్టుల్లో సేవలందిస్తుండగా, పోలీస్ కంట్రోల్ రూమ్ విభాగం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. మహిళా అధికారులే నేరుగా సంఘటనా స్థలానికి చేరుతుండటంతో బాధితులు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ వేదనను చెప్పుకోగలుగుతున్నారు.
గత 185 రోజుల్లో ఈ బృందాలు రికార్డు స్థాయిలో 8,903 ఫిర్యాదులను విజయవంతంగా అటెండ్ అయ్యాయి. ఇందులో 1,900 సమస్యలను నిరంతర కౌన్సిలింగ్ ద్వారా, 1,164 వివాదాలను పరస్పర రాజీతో సామరస్యంగా పరిష్కరించి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా నివారించాయి. క్షేత్ర విచారణ అనంతరం తీవ్రమైన అంశాలపై 2,504 కేసులను స్థానిక ఠాణాలకు పంపగా 61 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గృహహింస, వేధింపులు, ఆత్మహత్యాయత్నాల వంటి సున్నితమైన ఘటనలపై తక్షణం స్పందించి పలువురిని ‘సఖి’ కేంద్రాలు, షెల్టర్ హోమ్‌లకు చేర్చారు. తప్పిపోయిన నలుగురు చిన్నారులను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీ ఎమ్. శ్రీనివాసులు, ఐపీఎస్, అడిషనల్ సీపీ (లా & ఆర్డర్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) శ్రీ డి. జోయల్ డేవిస్, ఐపీఎస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు, ఐపీఎస్, డీసీపీ (ట్రాఫిక్) శ్రీ బి.కే. రాహుల్ హెగ్డే, ఐపీఎస్, డీసీపీ (గోల్కొండ జోన్) శ్రీ జె. రాఘవేంద్ర రెడ్డి, డీసీపీ (జూబ్లీహిల్స్ జోన్) శ్రీ ఎ. రమణారెడ్డి, డీసీపీ (ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్) డాక్టర్ పి. లావణ్య, ఐపీఎస్, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శ్రీ శేఖర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో పాటు వాహనాలు విరాళంగా అందించిన దాతలు పాల్గొన్నారు.
— Hyderabad City Police (@hydcitypolice) October 29, 2026
New vehicles aim to improve emergency response
The electric vehicles are equipped with 40 kWh batteries and can travel up to 468 km on a single charge, according to the police. Their compact design will enable personnel to reach narrow streets and lanes across the city, helping Spandana teams provide emergency assistance without delay.
The vehicles were provided by the Hyderabad City Security Council (HCSC) under its corporate social responsibility (CSR) initiative.
Speaking at the launch, Anand said police station patrol cars and Blue Colts vehicles were generally occupied with routine law and order duties and other petition-related inquiries.
He said the police had introduced dedicated Spandana teams to respond immediately to emergencies involving women and children.
With the new vehicles, the initiative would be strengthened further, he said. The teams would coordinate with the Dial 112 control room to ensure vehicles reach incident locations within minutes of receiving emergency calls.
Anand thanked the donors and HCSC for providing the vehicles under the CSR initiative, adding that they would help police take prompt action on the ground.
Spandana teams record 8,903 complaints in 185 days
Hyderabad Police Commissioner V.C. Sajjanar said the Spandana vehicles, launched by Chief Minister A. Revanth Reddy, had received a positive response from the public.
He said the new electric vehicles were procured based on feedback from women police drivers working in the field. The vehicles would help them reach people in distress more quickly, particularly in congested localities.
The women-led emergency response system currently operates across all seven law and order zones in Hyderabad, with 14 teams deployed.
Each team comprises a woman driver, a civil woman constable and an Armed Reserve woman constable.
The field teams work in two shifts between 10 am and 12.30 am, while the police control room remains operational round the clock.
With women police personnel directly reaching incident locations, complainants are able to share their grievances more freely, the police said.
In the past 185 days, the teams have attended to 8,903 complaints.
Of these, 1,900 issues were resolved through continued counselling, while 1,164 disputes were settled amicably through mutual reconciliation, helping prevent family breakdowns.
Following field inquiries, the teams referred 2,504 cases involving serious issues to the respective local police stations. A total of 61 first information reports (FIRs) were registered.
The teams also responded to sensitive incidents involving domestic violence, harassment and suicide attempts. Several people were referred to Sakhi centres and shelter homes for assistance.
The teams also traced four missing children and reunited them with their parents.
Senior police officials attend vehicle launch
Additional Commissioner of Police (Crimes) M. Srinivasulu, Additional Commissioner of Police (Law and Order) Tafseer Iqubal, Joint Commissioner of Police (Traffic) D. Joel Davis, Deputy Commissioner of Police (CAR Headquarters) R. Venkateshwarlu, DCP (Traffic) B.K. Rahul Hegde, DCP (Golconda Zone) J. Raghavendra Reddy, DCP (Jubilee Hills Zone) A. Ramana Reddy and DCP (Women and Child Safety Wing) P. Lavanya attended the programme.
HCSC Secretary General Shekhar Reddy, other police officials and the donors who contributed the vehicles were also present.

